మహేష్ కుటుంబానికి మిత్రుల ఆర్థిక సహాయం
మహేష్ కుటుంబానికి మిత్రుల ఆర్థిక సహాయం
-మహేష్ భార్యకు రూ.1.05 లక్షల నగదు అందజేత
కూడేరు,ఏప్రిల్ 24(AP 39 TV న్యూస్):-
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మిత్రుడు మృతి చెందాడు.. అతని కుటుంబనికి తమ వంతు సాయం అందించాలని అతనితోపాటు 6 నుంచి 10వ తరగతి చదివిన మిత్రులు భావించారు… వివరాల్లోకి వెళితే.. కూడేరు మండలం అంతరంగకు చెందిన మహేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతని మిత్రులు బుధవారం మహేష్ కుటుంబానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు మిత్రుని చిత్రపటానికి పూలమాలలు వేసే నివాళులు అర్పించారు. మిత్రులందరికీ మహేష్ భార్య తేజశ్వినికి రూ.1.05 లక్షల నగదును అందజేశారు. మేమంతా అన్నలుగా అండగా ఉంటాం. ధైర్యంగా ఉంటూ పిల్లలను బాగా చదివించుకోవాలని భరోసా ఇచ్చారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు