కూడేరులో రోడ్డు ప్రమాదం

కూడేరులో రోడ్డు ప్రమాదం .. ఒకరు మృతి

 

కూడేరు,ఏప్రిల్ 5 (AP 39 TV న్యూస్):-

కూడేరులో అనంత వెంకటరెడ్డి కాలనీ వద్ద శుక్రవారం ద్విచక్ర వాహనాన్ని స్కార్పియో వాహనం ఎదురుగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో కూడేరు మండలం కలగళ్లకు చెందిన జగన్నాథ్ రెడ్డి (40) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ,స్థానికులు తెలిపిన వివరాలు మేరకు… బొమ్మలాట పల్లెలో తమ బంధువుల పెళ్లికి జగన్నాథరెడ్డి తన భార్య వాసవి తో కలిసి ద్విచక్ర వాహనంలో వెళుతున్నాడు. అనంతపురం నుంచి స్కార్పియో వస్తూ ముందు వెళ్తున్న వాహనాలను ఓవర్టేక్ చేయబోయి అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనం పెట్రోల్ ట్యాంక్ పగిలి మంటలు చెలరేగి వాహనం దగ్ధమైంది. జగన్నాథ్ రెడ్డి , భార్య రోడ్డు పక్కన ఎగిరి పడ్డారు. వాసవికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఆమెను 108 లో అనంతపురం ఆసుపత్రికి తరలించారు. జగన్నాథ్ రెడ్డి విస్తా ఫర్టిలైజర్స్ కంపెనీలో సేల్స్ మెన్ గా పనిచేస్తున్నాడు. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు ఘటనాస్థలకి చేరుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ఆస్పత్రికి తరలించారు.

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.